ఇసుక ట్రాక్టర్ ఢీకొని వెలుగు వీవోఏ మృతి
చికెన్
రాజాం సిటీ: మండల పరిధి పెనుబాక గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముద్దాడజోగివలస గ్రామానికి చెందిన వెలుగు వీవోఏ కొయ్యాన జగదాంబ (44) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మృతురాలు వెలుగు వీవోఏగా విధులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తన సంఘంలోని సభ్యులకు రుణాల నిమిత్తం రాజాం కెనరా బ్యాంకుకు వెళ్లింది. అక్కడ విధులు ముగించుకుని అదే గ్రామానికి చెందిన సీఎస్‌పీ (కష్టమర్ సర్వీస్ ప్రొవైడర్) రామారావు బైక్‌పై బయలుదేరింది. పెనుబాక గ్రామ సమీపానికి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో జగదాంబ ఘటనా స్థలంలోనే మృతి చెందగా రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాఘవులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుని వద్ద వివరాలు ఆరా తీశారు. అనంతరం గాయాలపాలైన బాదితుడిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త లక్ష్మీనారాయణతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
విచ్చలవిడిగా ఇసుక తరలింపు
విచ్చలవిడిగా మితిమీరిన వేగంతో ఇసుకను తరలిస్తు ట్రాక్టర్లు ప్రమాదాలకు కారణమౌతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంతకవిటి, రేగిడి మండలాల్లోని నాగావళి నది నుంచి ఇసుక తరలింపు జరుగుతుంది. గమ్యం చేరాలనే తొందరలో మితిమీరిన వేగంతో వెళ్తు ప్రమాదాలకు కారణమౌతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
గూడ్స్ రైలు ఢీకొని ఒకరు..
లక్కవరపుకోట : కొత్తవలస–కిరండోల్ (కేకే) రైల్వే లైన్‌లో మండలంలోని రంగరాయపురం సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని మార్లాపల్లి గ్రామానికి చెందిన బత్తిన అప్పారావు(56) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకొంది. మృతుడు అప్పారావు ఒంట్లో నలతగా వుందని కుమార్తె ఇంటికి వెళ్లి అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్తానని చెప్పి శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా కొత్తవలస నుంచి అరుకు వైపు వెళ్లున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని రోదించారు. ఈ మేరకు జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం తరలించారు. మృతుడికి భార్య రమణమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వెలుగు వీవోఏ మృతి
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వెలుగు వీవోఏ మృతి


