27, 28 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేష్ తెలిపారు. స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 27న ఉదయం పది గంటలకు విద్యార్థులతో భారీ ర్యాలీ, అనంతరం గురజాడ కళాభారతి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రెండో రోజు జిల్లాలో పేరుకుపోయిన విద్యా రంగ సమస్యలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికను రూపొందించి ఆ దిశగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా గర్‌ల్స్ కన్వీనర్ ఆర్.శిరీష, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.చిన్నబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్, కె.జగదీష్, ఎస్.సోమేష్, జిల్లా కమిటీ సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు.


