జేఎన్టీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
విజయనగరం రూరల్: స్థానిక జెఎన్టీయూ–జివి ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్) విద్యార్థులు 10 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆ కళాశాల ఉప కులపతి సుబ్బారావు శుక్రవారం తెలిపారు. నవంబర్ 14న జయరాజ్ స్టీల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ విభాగానికి చెందిన 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, విరి విజయం, జేఎన్టీయూ–జివి విద్యార్థుల ప్రతిభ, కృషి, పరిశ్రమ సిద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ట్రైనింగ్ – ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వీఎస్ వకుళ ఎంపికై న విద్యార్థులను అభినందిస్తూ, ఈ విజయం కళాశాలలోని ఉన్నత స్థాయి విద్యా వాతావరణం, మరియు విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కలిగించే శిక్షణా కార్యక్రమాల ఫలితమని తెలిపారు.


