
పాలిసెట్‌లో ప్రతిభ
విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. అధికమంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన 8,097 మందిలో 7,705 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో విజయనగరం జిల్లాలో 6,938 మందిలో 95.36 శాతంతో 6,616 మంది, పార్వతీపురం మన్యంలో 1,159 మందిలో 93.96 శాతంతో 1,089 మంది ఉత్తీర్ణలయ్యారు. విజయనగరం జిల్లాలో బాలికలు 97.44 శాతం, బాలురు 93.9 శాతం, మన్యంలో బాలికలు 96.59 శాతం, బాలురు 92.35 శాతం పాసయ్యారు. 117 మార్కులు సాధించిన షేట్ అబ్దుల్ ముజీర్, చిల్లా పూర్ణ సంజయ్, మండల వాగ్దేవిలు విజయనగరం జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి ర్యాంకర్లగా నమోదయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 113 మార్కులతో పప్పల చక్రి (ప్రథమ), 112 మార్కులతో పొడుగు యోగిభద్రినాథ్ (ద్వితీయ), 111 మార్కులతో ఇప్పిలి వెంకటరమణ తృతీయ స్థానంలో నిలచారు.
వంద మార్కులు పైబడి..
పాలిసెట్‌లో 120కు 100 మార్కుల పైబడి అధికమంది విద్యార్థులు సాధించారు. వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఉప్పు లాస్య మాధురి (116/120), ఎల్.భాషిణి (114/120), పూసపాటిరేగ మండలం కొప్పెర్లకు చెందిన పల్లా హేమశ్రీ (112/120), మత్స వెంకటలక్ష్మి (111/120), బి.జ్యోత్స్న (110/120), గరివిడి మండలం ఆర్తమూరుకు చెందిన పెద్దపోలు తేజా (106/120) ఉన్నారు.
విజయనగరంలో 95.36 శాతం, మన్యంలో 93.96 శాతం మంది ఉత్తీర్ణత

పాలిసెట్‌లో ప్రతిభ

పాలిసెట్‌లో ప్రతిభ