
విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
చీపురుపల్లి: మండలంలోని కర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు దక్కింది. విజయవాడకు చెందిన హెల్త్ కేర్ ట్రస్టు ప్రతీ ఏటా ఉత్తమ సేవలు అందిస్తున్న స్టాఫ్‌నర్స్‌ల కోసం నిర్వహిస్తున్న అవార్డులు ఎంపికలో భాగంగా ఈ ఏడాది జిల్లా నుంచి కర్లాం స్టాఫ్ నర్స్ విజయలక్ష్మికి అవకాశం లభించింది. ఈ మేరకు త్వరలో విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు. దీంతో ఆమెను పీహెచ్‌సీలో ఉన్న సిబ్బంది అభినందించారు.