
అగచాట్లు
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025
పింఛన్ కోసం..
ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగురాలి పేరు గంగమ్మ. మక్కువ మండలం డి.శిర్లాం గ్రామం. వయస్సు 65 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితి. గతంలో అందే పింఛన్ కొన్నినెలలుగా ఆగిపోయింది. జీవనానికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యుల తోడుతో కలెక్టరేట్‌కు వచ్చింది. పింఛన్ మంజూరు చేసి జీవన భరోసా కల్పించాలంటూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను వేడుకుంది.
●
పార్వతీపురంటౌన్:
కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలవుతోంది. గతేడాది నవంబర్ నెల తర్వాత పింఛన్లు పొందుతూ భర్తలు కోల్పోయిన వితంతువులకు మినహా.. కొత్త పింఛన్ ఒక్కటీ మంజూరుకాని పరిస్థితి. వివిధ కారణాలతో పింఛన్ రద్దయినవారు, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించేవారికి పింఛన్ ఎండమావిగానే కనిపిస్తోంది. పింఛన్ కోసం దివ్యాంగుల కష్టాలకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం కనిపించిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. పింఛన్ కోసం అగచాట్లు పడుతూ పలువురు దివ్యాంగులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు తమ గోడు వినిపించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదంటూ సమస్యను తెలియజేశారు. పింఛన్ మంజూరుచేసి ఆదుకోవాలని వేడుకున్నారు.
● 10 నెలలుగా మంజూరుకాని కొత్త పింఛన్లు
● పింఛన్లకోసం దివ్యాంగుల అవస్థలు
● కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు విన్నపాలు
న్యూస్‌రీల్

అగచాట్లు