
అంతర్రాష్ట్ర సమన్వయంతో దాడులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమ మద్యం తయారీ యూనిట్లపై అంతర్రాష్ట్ర సమన్వయంతో పెద్ద ఎత్తున దాడి నిర్వహించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. అక్రమ మద్యం తయారీకి వ్యతిరేకంగా నిరంతరం చర్యలు తీసుకుంటున్న ఎకై ్సజ్ శాఖ, ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి సోమవారం ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్ బ్లాక్ కొత్తగూడ, కంగమానుగూడ, సరిహద్దు వెంబడి ఉన్న చీడివలస, కర్లి గ్రామాల అటవీ ప్రాంతాల్లోని అధిక సాంద్రత కలిగిన అక్రమ మద్యం తయారీ యూనిట్లపై పెద్ద ఎత్తున దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో 23,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటలను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు చెప్పారు. అలాగే 440 లీటర్ల ఐడీ మద్యాన్ని పట్టుకుని ధ్వంసం చేశామన్నారు. దీనికి సబంధించి ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేశామని, పలువురు అనుమానితులను కూడా దాడిలో గుర్తించామని ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఉద్దేశించిన విజయవంతమైన ఈ ఉమ్మడి ఆపరేషన్‌న్‌లో, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాల ఎకై ్సజ్ శాఖల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు