
మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ రేపు
విజయనగరం : జిల్లా తైక్వాండో అసోసియేషన్ సారథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయనగరం రాజీవ్ స్టేడియంలో మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ జరగనుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్.వేణుగోపాలరావు తెలిపారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నాలుగు రోజుల పాటు విదేశాల నుంచి వచ్చే శిక్షకులచే అతిథ్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. సెమినార్‌లో ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ ట్రైనర్‌గా వ్యవహరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సెమినార్ మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ సెమినార్‌ల పాల్గొనవచ్చని తెలిపారు.