
అన్నా క్యాంటీన్ నిర్వహణ సక్రమంగా ఉండాలి
● బీజేపీ, జనసేన నాయకుల డిమాండ్
నెల్లిమర్ల: నెల్లిమర్లలోని అన్నా క్యాంటీన్ సిబ్బంది నిర్వాకం వల్ల పేదలకు అందాల్సిన ఆహార పదార్థాలు పక్కదారి పడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన జనసేన మండల అధ్యక్షుడు పతివాడ అచ్చింనాయుడు, జనసేన నాయకుడు మజ్జి రాంబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నడిపేన నారాయణమూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లిమర్లలోని అన్నాక్యాంటీన్‌లో టిఫిన్, భోజనం పేదలకు అందకుండా పక్కదారి పడుతోందని విమర్శించారు. అన్నా క్యాంటీన్‌లో పార్శిల్ కట్టే నిబంధన లేకున్నా సిబ్బంది కొంతమందికి పార్శిల్ చేస్తున్నారని, దీంతో పేదలకు ఆహారం అందడం లేదన్నారు. ఉదయం టిఫిన్ 9 గంటలకు వరకూ ఉండాల్సి ఉన్నా పార్శిల్స్ కట్టడం వల్ల 7.30 గంటలకే పూర్తవుతోందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహార పదార్థాలు అందేవిధంగా చూడాలని కోరారు.
సాక్షిపై అక్కసు తగదు
నెల్లిమర్ల రూరల్: వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్న సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం అ క్కసు పెంచుకోవడం తగదని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం సరికాదన్నారు. ప్రజా స మస్యలను నిత్యం వెలుగులోకి తెస్తున్న పత్రికల పై, సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చ ర్యలకు పాల్పడుతోందన్నారు. ఇటీవల ఏలూరులో కూడా సాక్షి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్నారు. పత్రికా స్వేచ్ఛ కు భంగం కలిగించరాదని హితవు పలికారు.