
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: భార్య తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మానసిక అవేదన చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్ల మండలంలోని వల్లాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది. గుర్ల మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన రుంకాన రాంబాబు (29)కు రెండు నెలల క్రితం అదే మండలంలోని కెల్ల గ్రామానికి చెందిన వాణిశ్రీతో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో రాంబాబు మానసికంగా అవేదన చెందుతుండేవాడేని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య వాణిశ్రీని తీసుకువెళ్లడానికి కెల్ల బయలుదేరిన రాంబాబు జమ్ముపేట రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో యువకుడు..
బలిజిపేట: మండలంలోని గౌరీపురం సమీపతోటలో కె.ఫణీంద్ర (27) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి తమ్ముడు సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సింహాచలం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన కె.ఫణీంద్రకు వ్యక్తిగతంగా ఉన్న అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య