శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025

May 9 2025 12:51 AM | Updated on May 9 2025 12:55 AM

సాక్షి, పార్వతీపురం మన్యం: సాక్షి ఎడిటర్‌పై దాడి.. జర్నలిస్టుల గొంతు నొక్కి, దౌర్జన్య పాలన సాగించడమేనని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నియంత ప్రభుత్వంలో.. దౌర్జన్య పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తూ, నిర్భయంగా వార్తలు రాసే పాత్రికేయుల గొంతు నొక్కాలని చూడటం.. పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యలు మంచివి కాదని హితవు పలికారు. గురువారం ఉదయం విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయరెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంటుపై పోలీసులు దాడులు, తనిఖీలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పాత్రికేయులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా ఆస్పత్రి కూడలి వద్దనున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు వెళ్లారు. అక్కడ నినాదాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతూ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

‘సాక్షి ఎడిటర్‌పై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడి.. నియంత ప్రభుత్వమా! సిగ్గు సిగ్గు!!.. జర్నలిస్టుల గొంతునొక్కి దౌర్జన్య పాలనా?.. ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా?..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా ‘సాక్షి’ ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సెర్చ్‌ వారెంట్‌ అడిగినా చూపకుండా దురుసుగా ప్రవర్తించారన్నారు. ఇతర కేసుల్లో ముద్దాయిలు ఈ అపార్టుమెంటులో ఉన్నారంటూ, ఈ ప్రాంతంలో చేస్తున్న తనిఖీలలో భాగంగా వచ్చామని పొంతనలేని సమాధానాలు చెబుతూ.. దాదాపు గంటకుపైగా భయానక వాతావరణం సృష్టించారని చెప్పారు. గౌరవప్రదమైన పత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్‌.ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతో పాటు, సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో పోలీసులు వ్యవహరించారన్నారు. అవినీతి, అక్రమాలను వెలికితీయడంతో పాటు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికారంగంపై దాడిచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే, పీజేఎఫ్‌ సంఘాలు మద్దతు పలికాయి. గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు. పాత్రికేయులు కె.ఎన్‌.రామకృష్ణ, ఆశపు జయంత్‌కుమార్‌, మహందాతనాయుడు, సుధీర్‌, వి.దాలినాయుడు, ఎద్దు చిన్నారావు, సీహెచ్‌ ప్రసాద్‌, నవీన్‌, జనార్దన, ఆర్‌.సుధాకరరావు, దివానీ, ఉపేంద్ర, పిన్నింటి చిన్న, బసవ ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు సిగ్గుచేటు

‘సాక్షి’ ఎడిటర్‌ ఇంటిపై దాడి.. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడమే..

నినదించిన పాత్రికేయులు

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 20251
1/3

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 20252
2/3

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 20253
3/3

శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement