
మీడియాను అణగదొక్కే ప్రక్రియ ఇది
ఎలాంటి కేసులూ లేకపోయిన కేవలం కక్షగట్టి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం తగదు. సాక్షి మీడియాను అణగదొక్కే ప్రక్రియలో భాగంగా ఈ దాడిని పరిగణిస్తున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక చర్యలను ఎవరు ప్రశ్నించరాదనే నిరంకుశ ధోరణితో కుట్రపూరితంగా ఈ దాడిని చేయించారని అర్థమవుతోంది. ఇది కేవలం సాక్షి ఎడిటర్‌పై మాత్రమే జరిగిన దాడికాదు.. భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవేదాడులు, ఇవే ఆంక్షలు, ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియా పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం.
– వంగల దాలినాయుడు,
పార్వతీపురం జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు
●