
రైతులను ఆదుకోవడంలో.. కూటమి ప్రభుత్వం విఫలం
భామిని: అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. భామిని మండలం కోసలి, కీసర గ్రామా ల్లో ఈదురు గాలులకు దెబ్బతిన్న పంటలను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి తోట సింహాచలం, వైస్ ఎంపీపీ బోనగడ్డి ధర్మారావు, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు మజ్జి మోహనబాబుతో కలిసి గురువారం పరిశీలించారు. తక్షణమే పంట నష్టాలను అంచనా వేసి పరిహారం చెల్లించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతిరైతుకు రూ.20 వేలు అందజేయాలని కోరారు. రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభు త్వం విస్మరించడంపై మండిపడ్డారు. రైతులు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొన్న, రబీ వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కిల్లారి ఫల్గుణరావు, గెల్లంకి రమేష్, బోడ్డేపల్లి ప్రసాద్, కాగితాపల్లి కృష్ణారావు, కొత్తకోట ఆంజనేయులు, చెంగల ఫల్గుణ, కొరికాన నరశింహం, కార్యకర్తలు పాల్గొన్నారు.
కీసర, కోసలిలో పంట నష్టాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కళావతి