
చామలాపల్లిలో దారుణ హత్య
శృంగవరపుకోట: భార్య దూరం అయ్యేందుకు కారణమైన వ్యక్తిపై పగబట్టాడు. చివరకు ఆ వ్యక్తిని హత్యచేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన ఎస్.కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తొత్తడి ప్రసాద్(38), నడుపూరి మురళీకి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మురళీ భార్య రెండేళ్లుగా భర్తకు దూరంగా ఇద్దరి కుమార్తెలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఇంటికి రావాలని ఇటీవల మురళీ పిలిచినా ఆమె రాలేదు. భార్య తన నుంచి విడిపోవడానికి ప్రసాద్ కారణమని మురళీ భావించాడు. పలుసార్లు ప్రసాద్‌ను చంపేస్తానంటూ గ్రామస్తుల వద్ద హెచ్చరికలు చేశాడు. అదును కోసం ఎదురు చూశాడు. గ్రామంలోని ఓ ఇంటి వద్ద పెళ్లి సామాన్లు దించుతున్న ప్రసాద్‌పై కత్తితో దాడిచేశాడు. తల, మెడపై నరకడంతో ప్రసాద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన మురళి ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మృతుడు తొత్తడి ప్రసాద్
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!

చామలాపల్లిలో దారుణ హత్య