పట్టాలు ఇప్పించండి సారూ..! | - | Sakshi
Sakshi News home page

పట్టాలు ఇప్పించండి సారూ..!

May 6 2025 1:12 AM | Updated on May 6 2025 1:12 AM

పట్టాలు ఇప్పించండి సారూ..!

పట్టాలు ఇప్పించండి సారూ..!

పార్వతీపురంటౌన్‌: గడిచిన 60ఏళ్లుగా చేస్తున్న వ్యవసాయ భూములకు సంబంఽధించి పట్టాలు ఇప్పించాలని వీరఘట్టం మండలం శాంతిగూడ, గదబవలస, జడగూడ, సింధునగరం, పెద్దూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిరసన తెలియజేసి డీఆర్‌ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ పూర్వీకులనుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఫారెస్టు అధికారులు తమ భూములు ఖాళీ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తమపై దయఉంచి ఈ భూములకు సంబంధించి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement