
బొబ్బిలిలో జిల్లా స్థాయి టేబుల్‌టెన్నిస్ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల ఏవీ హాలులో సోమవారం జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో బి.హర్షిత్, బి.అభినయ కార్తీక్‌లు విన్నర్, రన్నర్‌లుగా, సీనియర్ విభాగంలో బి.ధనుంజయ్, టి.సత్యనారాయణలు విన్నర్, రన్నర్‌లుగా నిలిచా రని పీడీ వెంకటనాయుడు తెలిపారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్, బాల్‌బ్యాడ్మింటన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఏబీసీ నాయుడు, రాజీవ్, అరుణ్‌కుమార్, జలగం శ్రీనివాస్ ప్రభాకర్, హెచ్‌ఎం సునీత తదితరులు పాల్గొని విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.