
ఆస్తమా..అలక్ష్యం..అంతే..!
విజయనగరం ఫోర్ట్: ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి పిల్లలతో పాటు పెద్దలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. జన్యుపరంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే పొగతాగేవారికి ఆస్తమా ఉంటే వ్యాధి మరింత తీవ్రమవుతుంది. మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆస్తమా బాల్యదశలో కూడా చిన్నారులకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని వాడుక భాషలో పాల ఉబ్బస అంటారు. ఈ వ్యాధి సోకితే మనిషిని కుదురుగా ఉండనీయదు. ముఖ్యంగా చలికాలంలో ఈవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో కాస్త ప్రశాంతంగా ఉంటారు. వేసవిలో కూడా ఆస్తమా ఉన్నవారు చల్లటి నీరు తాగితే వ్యాధి తీవ్రం అవుతుంది.
సైన్‌సైటిస్, ఇస్నోఫిలీయో ఆస్తమాగా మార్పు
సైనసైటిస్, ఇస్నోఫిలియో, ఫుడ్‌ఎలర్జీ, డస్ట్‌ఎలర్జీ క్రమేణా ఆస్తమాగా మారుతాయి. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే ఆస్తమా బారిన పడకుండా ఉంటారు. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి బారిన పడతారు. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
జిల్లాలో 800 నుంచి 1000 కేసుల నమోదు
జిల్లా వ్యాప్తంగా నెలలో 800 నుంచి 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. సర్వజన ఆస్పత్రిలో నెలకు 200 నుంచి 300 మంది ఆస్తమా రోగులు చికిత్స కోసం వస్తున్నారు.
సొంతంగా మందులు వాడకూడదు
ఆస్తమా లక్షణాలు ఉన్న వారు మెడికల్ షాపుల్లోను, ఆర్‌ఎంపీల వద్ద మందులు కొనుగోలు చేసి వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా తగ్గినప్పటికీ వ్యాధి తీవ్రమవుతుంది. ఆస్తమా లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పలమనాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇన్‌హేలర్స్ వాడడం ద్వారా వ్యాధి అదుపులోకి వస్తుంది. – డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,
పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
జిల్లాలో నెలకు 800 నుంచి 1000 వరకు కేసుల నమోదు
సకాలంలో చికిత్స చేసుకోకపోతే
మృత్యువాత పడే ప్రమాదం
నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం
వ్యాధి లక్షణాలు
ఆయాసంగా ఉండడం
పిల్లికూతలు రావడం
చాతీ భారంగా ఉండడం
కఫం ఎక్కువగా ఊరుతుండడం
ఊబకాయం వల్ల కూడా అస్తమా వస్తుంది
గర్భిణుల్లోనూ ఆస్తమా వచ్చే అవకాశం
వ్యాధి తీవ్రమైతే మృత్యువాతపడే ఆస్కారం
వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పలమనాలజిస్ట్‌ను కలిసి చికిత్స చేయించుకోవాలి. వ్యాధి తీవ్రమైతే శ్వాసవ్యవస్థ ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం రోజుకు 100మంది ఆస్తమాతో ప్రాణాలు వదులుతున్నారు.

ఆస్తమా..అలక్ష్యం..అంతే..!