
పీహెచ్‌సీల్లో ప్రసవాల మెరుగుకు కృషి చేయాలి
పార్వతీపురం టౌన్: మాతా, శిశు వైద్య సేవలు, పీహచ్‌సీలో ప్రసవాల మెరుగు కోసం స్టాఫ్‌నర్సులకు శిక్షణ ఇచ్చామని ఆ దిశగా వారంతా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న పీహెచ్‌సీ స్టాఫ్ నర్సులకు ధ్రువీకరణ పత్రాలను శనివారం సాయంత్రం ఆరోగ్య కార్యాలయంలో ఆయన అందజేశారు. శిక్షణ నైపుణ్యాన్ని సద్వినియోగం చేయాలని డీఎంహెచ్‌ఓ ఈ సందర్భంగా వారికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు వైద్య సేవలను మరింతగా మెరుగు పరిచే లక్ష్యంగా, పీహెచ్‌సీలలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేసే దిశగా స్టాఫ్‌నర్సులకు ఎస్బీఏ (స్కిల్డ్ బర్త్ అటెండెంట్) రీఓరియంటేషన్ శిక్షణ నిర్వహించామని ఫిబ్రవరిలో ప్రారంభించి బ్యాచ్‌ల వారీగా ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డా. ఎం.నారాయణరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.కేవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు డా.టి.జగన్‌మోహనరావు, డా.పీఎల్. రఘుకుమార్, డీపీహెచ్‌ఎన్‌ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కరరావు