
18 కిలోల గంజాయి పట్టివేత
శృంగవరపుకోట: శృంగవరపుకోట సమీపంలో పందిరప్ప జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 18 కిలోల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులకు అందిన సమాచారం మేరకు పందిరప్ప జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెడ్ కలర్ మాక్సిమో ప్లస్ హౌస్‌హోల్డ్ ఫర్నిచర్ కలిగిన వాహనాన్ని తనిఖీ చేయగా 18 కిలోల గంజాయి పట్టుబడింది. వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు చెప్పడంతో ఆ వ్యక్తిని అరెస్టుచేసి వ్యాన్, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.