
సమ్మర్ బూట్ క్యాంప్‌ను సందర్శించిన డీఈవో
శృంగవరపుకోట : మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిసున్న ఏటీఎల్ సమ్మర్ బూట్ క్యాంప్‌ను డీఈవో యు.మాణిక్యాలనాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. పేపర్‌ట్రోనిక్స్, రొబోటిక్స్‌పై విద్యార్థుల స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు డవలప్ చేసిన కంప్యూటర్ గేమ్‌ను చూసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చిన్నతనంలో ఆటోమేటిక్ కార్ల బొమ్మలు బజారులో కొనుక్కునే వారమని, ఇప్పుడు మీరే తయారు చేయటం ఆశ్యర్యం, అద్భుతం అన్నారు. ఇలాంటి వసతులు సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని, వాటిని వాడుకోవాలన్నారు. సమ్మర్ బూట్ క్యాంప్‌లో కోడింగ్, ఆటోమేషన్, పేపర్‌ట్రోనిక్స్, పిక్టోబ్లాక్ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఇప్పటివరకూ ల్యాబ్ సాధించిన విజయాలను జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్, హెచ్.ఎం ఉమామహేశ్వరరావు, ల్యాబ్ ఇంచార్జ్ వి.రమేష్‌లు డీఈవోకు వివరించారు. 2019లో ప్రారంభమైన ల్యాబ్ జాతీయ స్థాయిలో హబ్ అటల్ ల్యాబ్‌గా గుర్తింపు సాధించిందన్నారు. రమేష్ మాట్లాడుతూ ఫ్రాన్స్‌కు చెందిన లా పౌండేషన్ డస్సాల్‌సిస్టమ్స్ సహకారంతో యూరిన్ రెగ్యులేటరీ డివైస్, బనానాకాటన్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేశామని, సి.డి.పి.ఎం.డి ప్రోడక్ట్స్ పేటెంట్ కోసం రిజిస్టర్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏఎంవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.