
ఏపీ కబడ్డీ జట్టు కోచ్‌గా చైతన్య
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్‌గా విజయనగరానికి చెందిన పాలూరి చైతన్య నియామకమయ్యారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు బిహార్‌లోని రాజ్‌గిరిలో 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచ్‌గా చీపురుపల్లి మండలానికి చెందిన పాలూరి చైతన్య ఎంపికయ్యారు. చైతన్య ప్రస్తుతం శాప్ కబడ్డీ కోచ్‌గా విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన చైతన్యను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎలమంచలి శ్రీకాంత్, విజయనగరం కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కోరాడ ప్రభావతి అభినందించారు.