
రాష్ట్రంలో బీహార్ సంస్కృతి
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, పాల్గొన్న నేతలు
రాజాం సిటీ: రాష్ట్రంలో బీహార్ సంస్కృతి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుపై టీడీపీ గూండాల దాడిని ఖండించారు. సుదర్శనరావును రాజాంలో శనివారం పరామర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి దాడులు చేసి భయపెట్టాలనుకోవడం హేయమైనచర్యగా పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొంది రాజకీయంగా ఎదుగుతున్నవారిపై దాడులుచేసి, భయపెట్టి లొంగదీసుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచకాలు అధికమయ్యాయన్నారు. దాడులు, తప్పులు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షిస్తే ఇటువంటి దాడులు పునరావృతం కావన్నారు. ఇప్పటికీ తమకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా ఎటువంటి దాడులు, ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శాంతియుత పరిపాలన చేశారని, సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నారన్నారు. పార్టీ అధికారంలో ఉందని ఇష్టానుసారం దాడులు చేయడం, చట్టాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తే ప్రజా కోర్టులో ఫలితం వేరేగా ఉంటుందన్నారు. సుదర్శనరావుకు మేమంతా భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులకు భవిష్యత్‌లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
● వైఎస్సార్ సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ అధినాయకత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పునకు అనుకూలంగా పాలన చేయాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. అధికారం శాశ్వతం కాదని, మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు చేస్తున్న హేయమైన ఘటనలకు చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ప్రజల తరఫున పోరాడే వ్యక్తులపై దాడులు చేస్తే తగ్గేదేలేదని, న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
● వైఎస్సార్ సీపీ రాజాం ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి పగ, ప్రతీకారాలతో రగలిపోతున్నారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు జరుగుతుండడం విచారకరమన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలే భద్రయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ పట్టణ, మండలాల అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, కరణం సుదర్శనరావు, ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, వైస్ ఎంపీపీలు యాలాల వెంకటేష్, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, కిమిడి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ
వైఎస్సార్‌సీపీ వంగర మండలాధ్యక్షునిపై దాడి హేయం
వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్

రాష్ట్రంలో బీహార్ సంస్కృతి