
ఒడిశా సరుకులు మాకొద్దు
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజల్లో ఒడిశా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. వాస్తవంగా ఈ ప్రాంత ప్రజలకు రెండు రాష్ట్రాల నుంచి రేషన్ సరుకులు, సంక్షేమ పథకాలు అందుతాయి. ఇటీవల ఒడిశా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ఆంధ్రా పథకాలు అందకుండా అడ్డుకుంటోంది. అభివృద్ధి పనులకు అభ్యంతరం తెలుపుతోంది. గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఒడిశా చర్యలను కొటియా గ్రూపులోని పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశా ప్రభుత్వం నేరెళ్ల వలసలో శనివారం ఇచ్చిన రేషన్ సరుకులు తీసుకునేందుకు ఎగువశెంబి, దిగువశెంబి,ఽ దూళిభద్ర, పనుకులోవ తదితర గ్రామాల గిరిజనులు నిరాకరించారు. అక్కడ ఆంధ్రా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ సరుకులను తీసుకున్నారు. ఆంధ్రా ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు ఆటంకం కల్పించమని ఒడిశా అధికారులు హామీ ఇస్తేనే రేషన్ తీసుకుంటామని తేల్చిచెప్పారు.
రేషన్ సరుకులను నిరాకరించిన కొటియా గ్రూపులోని నాలుగు గ్రామాల ప్రజలు