
వర్షా కాలం.. జరభద్రం
సత్తెనపల్లి: జిల్లాలో వర్షాకాలం కారణంగా మారిన వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలతో నెలకొన్న చల్లని వాతావరణానికి దగ్గు, కఫం, జలుబు చేసే అవకాశం ఉందని, వీటికి తోడు మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా, చికున్ గున్యా వంటి జ్వరాలు ప్రబలుతాయంటున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారే ఉన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్య లోపం, తదితర కారణాలతో పాటు ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులతో జనం అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 15 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం
జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన