
దగా చేసిన కూటమి సర్కారు
2023లో క్వింటా మిర్చి రూ.20 వేలకు పైగా అమ్ముడుపోగా గత ఖరీఫ్‌లో కనీసం రూ. 8 వేలు కూడా పలకని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచారు. మంచి ధర వస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఆ రోజే అమ్ముకొని ఉంటే కనీసం కోల్డ్ స్టోరేజ్ బాడుగు ఖర్చు అయినా మిగిలేదని బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశపడ్డ రైతులు దగాపడ్డారు. మిర్చి ధరల స్థిరీకరణ చేసి మద్దతు ధర ఇస్తుందని ఆశపడగా ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలు చేయలేదు. దీంతో రైతులు నిండా మునిగి మిర్చి పంట అంటే భయపడే పరిస్థితికి వచ్చారు.