
24 నుంచి సీహెచ్‌వోల నిరవధిక సమ్మె
నరసరావుపేట: ఈ నెల 24వ తేదీ నుంచి శాంతియుతంగా నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు అనుపమ ప్రకటించారు. జిల్లాలో విలేజ్ క్లీనిక్స్‌లో సీహెచ్‌వోలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ రోడ్డులోని గాంధీపార్కు ఎదుట ఏపీ మిడ్ లెవెల్ హెల్తె ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఎ) ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారంతో పదో రోజుకు చేరింది. శిబిరాన్ని సీపీఐ జిల్లా నాయకులు కాసా రాంబాబు, ఉప్పలపాటి రంగయ్య, గాంధీ స్మారక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోపీచంద్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కేఎన్ కృష్ణ, పీఎస్‌కే నాయకుడు కంబాల ఏడుకొండలు, బీసీ సంఘ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు సందర్శించారు. తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న వీరందరికీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు సాగర్, రాము, మస్తాన్ పలువురు సీహెచ్‌వోలు పాల్గొన్నారు.
సంఘీభావం తెలిపిన సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు