
బీఎంసీ కమిషనర్‌పై దాడికి నిరసన
మల్కర్‌గిరి: మల్కన్‌గిరిలో గురువారం కూడా జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, ఓఎస్ అధికారులు పెన్‌డౌన్ చేశారు. భువనేశ్వర్‌లో బీఎంసీ కమిషనర్ రత్నకర్ సాహుపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా యునీట్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలిపారు. రెండు రోజులుగా ప్రఽభుత్వ పనులను అపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే తిరిగి విధులు నిర్వహిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. జిల్లా క్లర్క్ సంఘం అధ్యక్షుడు సి.హెచ్.కృష్ణరావు, తదితరులు పాల్గొన్నారు.
బస్సులో వర్షం నీరు
● ప్రయాణికుల అవస్థలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా భలిమెల నుంచి బరంపురం పట్టణానికి నడిచే బస్సు పైకప్పు నుంచి సీట్లపై వర్షం నీరు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ బస్సు ప్రతీరోజు మధ్యహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు తడిచి ముద్దవుతున్నారు. గురువారం కూడా బస్సు బయలిదేరినప్పుడు సీట్లు పూర్తిగా తడిచిపోయి ఉండటంతో కండక్టర్‌ను ప్రయాణికులు అడిగితే ఏ మాత్రం పట్టించుకోలేదు. తాము ఏమీ చేయలేమని, పైఅధికారులతో సంప్రదించాలని డ్రైవర్, కండక్టర్ చెప్పారు. రూ.600 టికెట్ కొని నరకయాతన పడి ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంపై బరంపురం డీటీఎం అరవింద్ మహంతిని వివరణ కోరగా.. బస్సు పైకప్పును బాగు చేస్తామన్నారు. శుక్రవారం నుంచి ఆ బస్సు స్థానంలో మరొక బస్సును పంపుతామన్నారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యుత్ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి
ఆమదాలవలస/ఎచ్చెర్ల: ఆమదాలవలస మున్సి పాలిటీ పరిధిలోని చొట్ట వానిపేట కాలనీలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతిచెంద గా మరొకరు గాయపడ్డారు. స్థానికులు తెలిపి న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చొట్టవానిపేట కాలనీలో గొర్లె పెంటయ్య ఇంటి నిర్మా ణం జరుగుతోంది. లావేరు మండలం చిన్నమురపాకకు చెందిన గేదెల లక్ష్మణ్(40), మురపాక రమణ రాడ్ బెండింగ్ పనుల కోసం గురువారం వచ్చారు. ఇనుప రాడ్లను భవనంపైకి తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగలగడంతో షాక్‌కు గురై కిందపడ్డారు. ఈ ఘటనలో లక్ష్మ ణ్ అక్కడికక్కడే మృతిచెందగా రమణ తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. మృతుడు లక్ష్మణ్‌కు భార్య అసిరితల్లి, ఇద్దరు కుమారులు భాస్కరరావు, బాలరాజు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.