
పంచాయతీ కార్యాలయానికి తాళాలు
కొరాపుట్: సెల్ ఫోన్ నెట్‌వర్క్ సమస్యతో విసిగిపోయిన గిరిజనులు పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలియజేశారు. కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి కుడి పంచాయతీ ప్రజలకు సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తమకు తెలియకుండా పోయిందంటు ప్రజలందరూ సోమవారం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి నినసన తెలియజేసి తాళం వేసి నిరస న వ్యక్తం చేశారు. ఈ సమయంలో కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీ రాణి, వార్డు సభ్యులు ఉన్నారు. సిగ్న ల్ సమస్యను తాము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గిరిజనులతో చర్చలు జరిపారు.