
ఏయూకి జయపూర్ రాజా రు. లక్ష విరాళం
కొరాపుట్: జయపూర్ మహారాజా 4వ విక్రం దేవ్ వర్మ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ విభాగంలో ఉన్న జయపూర్ విక్రం దేవ్ సెన్స్ అండ్ టెన్నాలజీ భవనం ముందు ఉన్న విక్రం దేవ్ వర్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. జయపూర్ రాజ వంశపు ప్రస్తుత వారసుడు, ప్రస్తుత మహారాజు విశ్వేశ్వర్ చంద్ర చుడ్ దేవ్ హజరై విక్రం దేవ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. సుమారు శతాబ్దం తర్వాత జయపూర్ నుంచి రాజా ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లారు. ఏయూ నిర్మాణ సమయంలో నాటి రాజా విక్రం దేవ్ వర్మ చాలా ఆర్థిక సహాయం చేశారు. 1926 వరకు ప్రతి ఏడాది రూ. లక్ష చొప్పున ఆక్కడి విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం పంపించేవారు. అప్పట్లో రూ. లక్ష విరాళానికి బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్య పోయారు. విక్రం దేవ్ చేసిన సహాయానికి గుర్తుగా ఏయూలో విక్రందేవ్ విగ్రహం ప్రతిష్టించారు. ఒక విభాగానికి నేటికీ అతని పేరు కొనసాగిస్తున్నారు. వారి వారసుడు చంద్ర చుడ్ దేవ్ తమ వంశీయుల పేరు ప్రతిష్టలు కాపాడడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా ఏయూకి లక్ష రూపాయల విరాళాన్ని శనివారం వర్సిటీ పాలకవర్గానికి అందజేశారు. మహారాజ ఆప్ కళింగ్ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఇకపై ప్రతి ఏటా ఏయూకి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఏయూకి జయపూర్ రాజా రు. లక్ష విరాళం