
కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం
కొరాపుట్: కల్తీ ఆహార పదార్ధా విక్రయాలపై అధికారులు ఉక్కు పాదం మొపారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారి అరుణ్ కుమార్ మహారణ నేతృత్వంలోని బృందం శనివారం పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. మెయిన్ రోడ్డులో స్వీట్స్ షాప్స్, రోడ్డు పక్కన విక్రయించే చిరు తిళ్ల దుకాణాల్లో సోదాలు జరిపారు. సుమారు 80 కేజీల కల్తీ ఆహారాలను గుర్తించి డ్రైనేజీల్లో పార వేశారు. ఆహారంలో రంగులు కలిపి విక్రయించవద్దని వ్యాపారులను హెచ్చరించారు. జగన్నాథ రథా యత్ర నేపథ్యంలో రోజూ గ్రామీణ ప్రాంతాల నుంచి గిరిజనులు నబరంగ్‌పూర్ వచ్చి తిను బండారాలు కొనుగోళ్లు చేస్తారు. ఇటువంటి ఆహారాన్ని కొనుగోలు చేసి తింటే వ్యాధులు ప్రబలుతాయని అధికారులు పేర్కొన్నారు.

కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం

కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం