బరంపురం: జిల్లాలోని అస్కా రోడ్‌లో నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీపై పెద్ద బజార్ పోలీసులు దాడులు చేపట్టిన ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బరంపురం ఎస్పీ సార్వణ్ వివేక్ తెలిపిన వివరాల మేరకు.. పెద్ద బజార్ పోలీసుస్టేషన్ పరిధి అస్కా రోడ్‌లో ఎటువంటి లైసన్స్ లేకుండా కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దీంతో ఈ కర్మాగారంపై బజార్ పోలీసు అధికారులు దాడులు చేపట్టి భారీగా నకిలీ మద్యం సామగ్రిలు, బాటిల్స్, యంత్రాలు, నకిలీ లేబుల్స్ సీజ్‌చేసి ఒక నిందితుని అదుపులోకి తీసుకున్నారు.