ముహూర్తమెన్నడో..? | - | Sakshi
Sakshi News home page

ముహూర్తమెన్నడో..?

Jul 4 2025 3:40 AM | Updated on Jul 4 2025 3:40 AM

ముహూర

ముహూర్తమెన్నడో..?

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయి న్‌ క్యాంపస్‌లో బాలికల నూతన హాస్టల్‌ నిర్మాణ పనులకు ముహూర్తం కుదరడం లేదు. నూతన గర్‌ల్స్‌ హాస్టల్‌ నిర్మాణం కోసం రూ.7కోట్ల రూసా నిధులు అందుబాటులో ఉన్నా, నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. తెయూ మెయిన్‌ క్యాంపస్‌లో బాలురకు రెండు హాస్టల్స్‌ ఉండగా, బాలికలకు మాత్రం ఒకే హాస్టల్‌ ఉంది. బాలుర రెండు హాస్టల్స్‌లో కలిపి 447 మంది ఉండగా, బాలికలకు ఉన్న ఒక్క హాస్టల్‌లోనే 440 మంది బాలికలు ఉంటున్నారు. దీంతో బాలికలు ఒకే గదిలో 6నుంచి 8మంది ఉండాల్సి రావడంతో బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2022లో యూజీసీ ఆదేశం

వర్సిటీ క్యాంపస్‌లో బాలురు, బాలికలకు సరిపడా నూతన హాస్టల్స్‌ నిర్మించాలని యూజీసీ 2022 నవంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. రెండున్నరేళ్లు కావొస్తున్నా హాస్టల్‌ నిర్మాణానికి ఇప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. గత విద్యాసంవత్సరం మేలో తెలంగాణ యూనివర్సిటీకి రూ.8.60 కోట్ల రూసా నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.7కోట్లు నూతన బాలికల హాస్టల్‌ నిర్మాణానికి, ఫుట్‌పాత్‌ నిర్మాణానికి రూ.కోటి, కంప్యూటర్‌ సైన్స్‌ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు వెచ్చించాల్సి ఉంది. టెండర్‌ పూర్తయినప్పటికీ సదరు కాంట్రాక్టర్‌ టీఎస్‌ఈడబ్య్లూఐడీసీ (తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ ఉమెన్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)తో అగ్రిమెంట్‌ చేసుకోక పోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా వర్సిటీ వీసీ, ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్‌ నిర్మాణం వెంటనే చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు.

తెయూలో బాలికల నూతన హాస్టల్‌

భవనానికి రూ.7 కోట్లు మంజూరు

పూర్తయిన టెండర్‌ ప్రక్రియ

ఇప్పటికీ ప్రారంభం కాని పనులు

త్వరలో పనులను ప్రారంభించేందుకు కృషి

తెయూలో బాలికల నూతన హాస్టల్‌ భవన నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీతో కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంది. కానీ అగ్రిమెంట్‌ కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయమై సదరు కాంట్రాక్టర్‌తో వీసీ యాదగిరిరావు మాట్లాడారు. వీలైనంత త్వరగా హాస్టల్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం.

– యాదగిరి, రిజిస్ట్రార్‌, తెలంగాణ యూనివర్సిటీ

ముహూర్తమెన్నడో..? 1
1/1

ముహూర్తమెన్నడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement