
ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆరాతీస్తున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
దోమకొండ: అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఆదివారం దోమకొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నూత న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రూ.5 లక్ష లు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి రూ.10 లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్య, వైద్యానికి తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. 108 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచి నిత్యం సేవలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకతీతంగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు తమ సమస్యలపై తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు. తన సొంత మేనిఫెస్టోను త్వరలోనే అమలు చేస్తానన్నారు. అంతకుముందు బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కానుగంటి శారద, జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, సర్పంచ్ అంజలి, ఎంపీటీసీ సదానంద, సింగిల్ విండో చైర్మ న్ నాగరాజురెడ్డి, డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, డీఆర్‌డీవో సాయన్న, ఆస్పత్రి సూపరింటెండెంట్ సంగీత్‌కుమార్, తహసీల్దార్ సంజయ్‌రావు, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎంపీవో తిరుపతిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ షమీ, బీజేపీ నాయకులు రాజేష్, భూపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా నియోజకవర్గ
అభివృద్ధికి పాటుపడదాం
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
వెంకటరమణారెడ్డి