
దేవుడి పేరే ఊరి పేరైంది
మీకు తెలుసా?
బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో ప్రవేశాలు ఇలా..
మీకోసం
వీరన్నగుట్ట గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల కిందట గుట్టమీద ఉన్న బండరాయి పగిలి రెండుగా విడిపోగా వాటి మధలో వీరభద్రస్వామి విగ్రహం బయటపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయంలో పూజలు ప్రారంభించారు. కొంతకాలానికి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో చెరుకు నరికేందుకు పలు ప్రాంతాలకు చెందిన కూలీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ముందుగా సాటాపూర్ ఫారంగా పంచాయతీ ఏర్పాటైంది. కాలక్రమేణ జనాభా పెరగడంతో వీరన్నగుట్టగా దేవుడిపేరుతో గ్రామానికి పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి జరిగిన మూడో రోజు ఇక్కడి ఆలయంలో రథోత్సవం, జాతరను వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా వీరభద్రుడు విరాజిల్లుతున్నాడు.
– రెంజల్(బోధన్)
జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఎస్సీ (షెడ్యూల్డ్ కులం) విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందవచ్చు. ఒకటో తరగతి (నాన్ రెసిడెన్షియల్), ఐదో తరగతి (రెసిడెన్షియల్)ల్లో ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు అందించాలి.
దరఖాస్తులు లభించే ప్రాంతం
● నిజామాబాద్ డివిజన్‌కు చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(63026 61897) సంప్రదించాలి.
● బోధన్ డివిజన్‌కు చెందిన విద్యార్థులు విజయమేరీ ఉన్నత పాఠశాలలో(90103 42437) సంప్రదించాలి.
● ఆర్మూర్ డివిజన్‌కు చెందిన విద్యార్థులు ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాలలో(96760 96374) సంప్రదించాలి.
దరఖాస్తు చివరి తేదీ
ఈనెల 16
అవసరమైన ధ్రువపత్రాలు
కుల, ఆదాయ, నేటివిటీ ధ్రువీకరణపత్రాలతోపాటు బర్త్ సర్టిఫికేట్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు. గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
అర్హతలు
● ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఎస్సీ కులానికి చెందిన విద్యార్థులు 1.6.2019 నుంచి 31.05.2020 మధ్యలో జన్మించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.లక్షా50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలోపు మించొద్దు.
● ఐదో తరగతిలో ప్రవేశం కోసం నాల్గో తరగతి బోనొఫైడ్, ప్రోగ్రెస్‌కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలి.
సీట్ల కేటాయింపు ఇలా
● ఒకటో తరగతిలో ఎస్సీ గ్రూప్–1 వారికి ఏడు సీట్లు, గ్రూప్–2 వారికి 61 సీట్లు, గ్రూప్–3 వారికి 34 సీట్లు.
● ఐదో తరగతిలో గ్రూప్–1లో ఏడు, గ్రూప్–2లో 60, గ్రూప్–3లో 34 సీట్లు కేటాయించారు. ఐదో తరగతికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.
– నిజామాబాద్‌అర్బన్
పోలీసుశాఖ ఉన్నతాధికారులు
నిజామాబాద్ సీపీ 87126 59800
నిజామాబాద్ ఏసీపీ 87126 59807
బోధన్ ఏసీపీ 87126 59809
ఆర్మూర్ ఏసీబీ 87126 59808
ట్రాఫిక్ ఏసీపీ 87126 59810
టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ 87126 59812