
బంద్ సక్సెస్ చేయాలి
లక్ష్మణచాంద: గ్రామీణ బంద్ సక్సెస్ చేయాలని తె లంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పేర్కొన్నారు. బుధవా రం మండలంలోని కనకాపూర్ గ్రామంలో కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయ న హాజరై మాట్లాడారు. మే 20న కార్మిక వర్గం నిర్వహిస్తున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో ఎస్‌కేయం ప్రజాసంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఉ పాధిహామీ పని దినాలను సగానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూలీలు ఐక్యంగా గ్రామీ ణ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యా ప్త సమ్మె, గ్రామీణ బంద్‌లో పాల్గొని జయప్రదం చే యాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, పంటలకు గిట్టుబాటు ధర క ల్పించాలని తెలిపారు. వీటిలో పార్లమెంట్‌లో చ ట్టం చేసి వ్యవసాయ కూలీలకు ఉపాధిహామీలో రో జు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రా ష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ లంక రాఘవులు, పద్మ, జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి అశోక్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి నరసింహ, నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి ౖమురళీమోహన్, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు బుచ్చ య్య, నిర్మల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగారం, జాదవ్ కిషన్ పాల్గొన్నారు.
కనకాపూర్‌లో మాట్లాడుతున్న వెంకట్రాములు