ఐపీఎల్‌ ఫైనల్‌లోమెరిసిన అనుష్క, స్పెషల్‌ లగ్జరీ వాచ్‌, ధర ఎంతో? | IPL 2026 RCB Anushka Sharma Rs 28 lakh Cartier Panthère watch steals attention | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫైనల్‌లోమెరిసిన అనుష్క, స్పెషల్‌ లగ్జరీ వాచ్‌, ధర ఎంతో?

Jun 2 2026 11:03 AM | Updated on Jun 2 2026 12:26 PM

IPL 2026 RCB Anushka Sharma Rs 28 lakh Cartier Panthère watch steals attention

ఐపిఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్‌ క్రికెటర​ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్‌లోని‌ అహ్మదా బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.

సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి  సింపుల్ అండ్ క్లాసీ లుక్‌లో   కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్‌లెట్ స్టైల్‌తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్‌లతో ప్రజాదరణ పొందింది.

కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్‌గా నిలిచింది. 

ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

Advertisement
 
Advertisement
Advertisement