
● ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం ● త్వరలో వెలువడనున్న
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలవడనుంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం, విద్యాశాఖ ఏకపక్షంగా నిర్ణయా లు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన దరఖాస్తు, స్థానాల ఎంపిక, కేటాయింపు ఇలా మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. నంద్యాల జిల్లా ప్రాతిపదికన నిర్వహించే బదిలీలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2023 జూన్‌లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను చేపట్టలేదు, రెండేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు విద్యా సంవత్సరం ప్రాతిపదికన తీసుకోనున్నారు. ఇందులో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు కనీస సర్వీసు రెండు సంవత్సరాల నుంచి ఎనిమిదేళ్ల వరకు తీసుకోనున్నారు. గ్రేడ్–2 హెచ్‌ఎంలకు ఐదేళ్లుగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు డిస్‌ప్లే
ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు డిస్‌ప్లే చేస్తారు. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఉన్న అన్ని ఖాళీలను బదిలీల్లో చూపుతారు.
● 2020 మే 31కు ముందు పాఠశాలల్లో చేరిన హెచ్‌ఎంలకు ఐదేళ్లు అదే పాఠశాలల్లో విద్యా సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.
● 2017 మే 31కి ముందు పాఠశాలల్లో చేరిన ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పని సరిగా బదిలీ కావాలి.
● 2027 మే నెలాఖరులోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉండే అవకాశం ఉంది.
● జిల్లా వ్యాప్తంగా అన్ని క్యాడర్‌లకు సంబంధించి 4,927 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పని సరి బదిలీలకు సంబంధించి 3 వేల మంది దాకా ఉండవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
జిల్లాలో ఉపాధ్యాయుల వివరాలు..
చర్చలలో ఒక తీరు, నిర్ణయాలు మరో తీరు
ఉపాధ్యాయుల బదిలీలు, పదో న్నతులకు సంబంధించిన విధి విధానాల పై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ఒక తీరుగా, నిర్ణయాలను అమలు చేసేటప్పుడు మరో తీరుగా వ్యవహరిస్తోంది. జీఓ 117ను బేషరతుగా రద్దుచేసి, దాని స్థానంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునః వ్యవస్థీకరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని దిగజార్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్‌గా నియమిస్తామనడం సరికాదు. – సుబ్బన్న ఎస్సీ,ఎస్టీ
ఉపాధ్యాయ సంఘం నాయకులు, నంద్యాల