
పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోండి
నంద్యాల(న్యూటౌన్): ఒప్పందానికి అనుగుణంగా పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను వేధిస్తున్న ప్రైవేటు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో పలు రైతుల నుంచి ప్రైవేటు కంపెనీ లు ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పంట చేతికొచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడులు మాట్లాడుతూ.. అలయన్స్ వన్, జీపీఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లా రైతులతో క్వింటా రూ.18,500 మేర కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు కొను గోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్లలో పొగాకు నిల్వ చేసుకోవడంతో రంగుమారి నాణ్యత దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వసుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీలతో చర్చించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం నాయకు లు సుబ్బరాయుడు, సురేష్, పొగాకు రైతులు బుజ్జయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, నారాయణ, థామస్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంపెనీలతో కలెక్టర్ చర్చలు జరిపి న్యాయం చేయాలి అగ్రిమెంట్ ధర ఇప్పించాలని డిమాండ్