
మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం
బొమ్మలసత్రం: పగిడ్యాల మండలానికి చెందిన మద్యం దుకాణానికి గీత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీలోగా జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలు చలానా రూపంలో సమర్పించాలని సూచించారు.
ఫిర్యాదులు
పునరావృతం కావొద్దు
బొమ్మలసత్రం: పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా పోలీసుల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదుల్లో అధికంగా అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగాల పేరుతో మోసాలు, తప్పుడు పత్రాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ సూర్యమౌళి పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఉయ్యాలవాడ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించా రు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందడం లేదని కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీల్లో కనీస మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు దుస్థితిపై, రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో వున్నాయా లేవా వైద్యాధికారులు, సిబ్బంది ఆసుపత్రులకు వస్తున్నారా లేదా సమయ పాలనపై ఆరా తీయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని పెద్దయమ్మనూరు, ఉయ్యాలవాడ, మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వసతుల కల్పనపై నివేదిక అందజేస్తామన్నారు.