
దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
దేశంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న అధ్వాన పరిస్థితులు లేవు. పత్రికలపై దాడులు చేయడం విలేకరులను బెదిరించడం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రిక ఎడిటర్ ఇంట్లోకే ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల గొంతు నొక్కేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇటీవల కాలంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతోంది.
– శంకర్, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ పార్టీ కార్యదర్శి, నంద్యాల
పత్రికా స్వేచ్ఛపై దాడి
సిగ్గుచేటు
సాక్షి పత్రిక సంపాదకులను ప్రభుత్వం టార్గెట్ చేయడం శోచనీయం. పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు సిగ్గుచేటు. అసలు రాష్ట్రంలో పత్రికలు, మీడియాకు స్వేచ్ఛ ఉందో లేదో అర్థం కావడం లేదు. ఉన్నది ఉన్నట్లు రాస్తే ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూడాల్సి వస్తోంది.
– ఆకుమల్ల రహీమ్, ఆల్‌మదర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, నంద్యాల

దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు