కర్నూలు(అర్బన్): మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ఈ నెల 29వ తేదీతో పదవీ బాధ్యతలు ముగిసిన ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీటీసీలు ఘనంగా సన్మానించారు. బుధవారం జెడ్పీ సమావేశ భవనంలో సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, తొగురు ఆర్థర్, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ, జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, డ్వామా ఎంఅండ్‌ఈ టి. విజయభాస్కర్‌నాయుడుతో పాటు రెండు జిల్లాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్‌టీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మంత్రి జయరాం నాలుగు సంవత్సరాలుగా ఎంతో శ్రమించారన్నారు. అలాగే ... జెడ్పీ సభ్యులుగా ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డి గత పాలక వర్గంలో, ప్రస్తుత పాలకవర్గంలో జరిగిన అనేక సమావేశాలకు హాజరై ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎంతో విలువైన సలహాలు, సూచనలు అందించారన్నారు.