
మంత్రి, ఎమ్మెల్సీలకు ఘన సన్మానం
రంజాన్ సందడి
ఉన్నతాధికారుల దృష్టిలో ఆ పెద్దసారు నిఖార్సయిన పోలీసు.. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరిస్తారనే నమ్మకం చూరగొన్నారు.. ప్రజాప్రతినిధులైనా సరే ఆయన దృష్టిలో అంతా సమానమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సారు డిపార్ట్‌మెంట్‌లో ఆదర్శం అనే అనుకోవాలి. అంతా బాగానే ఉన్నా.. ఆయన గతంలో పనిచేస్తున్న ఓ పోలీసుస్టేషన్‌లో రూ.80లక్షల విలువైన వెండి మాయమైన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిన్నటి వరకు ఆహా.. ఓహో అని ఆయన మాయలోని కొందరు ఉన్నతాధికారులు పొగిడినా.. ఇప్పుడు ఒక్కదెబ్బకు పోలీసు శాఖ విస్తుపోయే ఘటన కలకలం రేపుతోంది.
కర్నూలు నగరంలో రంజాన్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఘుమఘుమలాడే హలీం, హరిస్ సెంటర్లు, వేడివేడి సమోసాలు, పెరుగువడ, ఫలహార విక్రయ దుకాణాలు వెలిశాయి. ఇఫ్తార్ సమయంలో ముస్లింలు ఎక్కువగా సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతో దీక్షను విరమిస్తారు. వాటి కొనుగోలు దృశ్యాలివీ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
వ్యక్తి దారుణహత్య
కౌతాళం: మండల పరిధిలోని హాల్వి గ్రామంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఉసేన్‌బాషా (37) అలియాస్ ఉషా బ్రాందీ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే భోజనానంతరం వాకింగ్‌కు వెళ్లాడు. పాల డెయిరీ వరకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వల్లూరు క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియన దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న ఉషాను కౌతాళం వరకు ఆటోలో తరలించి అక్కడి నుంచి 108 వాహనంలో ఆదోనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
లక్ష్మీరంగనాథుడు పెళ్లికొడుకాయెనే!
జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం పూలచపురం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి మూల, ఉత్సవ విగ్రహాలకు పంచామృతంతో అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పట్టువస్త్రాలతో పెళ్లి కుమారునిగా అలంకరించారు. పదిరోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరిగిన అనంతరం నెల్లూరు జిల్లా శ్రీరంగాపురంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారితో స్వామి వారి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుందని అర్చకులు తెలిపారు. గురువారం స్వామివారికి సింహవాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వెంకటరమణ, చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు.
తనిఖీల్లో పట్టుబడిన 105 తులాల వెండి, రూ.2.50లక్షల నగదు
● విలువ రూ.80లక్షలకు పైమాటే
● నిబంధనలకు విరుద్ధంగా
స్టేషన్‌లోనే ఉంచుకున్న సీఐ
● ఆ తర్వాత
ఎవరికీ తెలియకుండా మాయం
● ఓ రైటర్, మరో ఇద్దరు పోలీసుల పాత్ర
● రహస్య విచారణతో నిర్ధారణ?
కర్నూలు: ‘‘సెలవులు వస్తున్నాయి.. ఎవరైనా ఊళ్లకు వెళ్లాలంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ ఇంటి భద్రత మాదీ.. సీసీ కెమెరాల పర్యవేక్షణతో దొంగల భరతం పడతాం..’’ ఇలా పోలీసు బాస్‌లు ప్రజలకు భరోసా కల్పిస్తుండగా.. ఆ శాఖలోని ఓ ఇంటి దొంగ బాగోతం పోలీసుల చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేస్తోంది. తనిఖీల్లో దొరికిన విలువైన వస్తువులకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోతే పోలీసు శాఖ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉంచాలనేది నిబంధన. కానీ ఓ పోలీసు అధికారి కొంతకాలం పోలీసుస్టేషన్‌లోనే భద్రపరిచినా.. ఆ తర్వాత మూడో కంటికి తెలియకుండా మాయం చేయడం ఇప్పుడు పోలీసు శాఖను కుదిపేస్తోంది. వివరాలివీ.. పంచలింగాల అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులో 2021 జనవరి నెలలో పోలీసుల తనిఖీలో ఎలాంటి బిల్లులు లేకుండా పక్క రాష్ట్రాలకు రవాణా చేస్తున్న రూ.80 లక్షల విలువ చేసే 105 తులాల వెండి ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు సీజ్ చేశారు. వీటన్నింటినీ అప్పటి సీఐ ఆధ్వర్యంలో అర్బన్ తాలూకా స్టేషన్‌లో భద్రపరచినట్లు సమాచారం. అయితే సీజ్ చేసిన వెండి, నగదుకు సంబంధించి తగిన ఆధారాలతో ఇటీవల పోలీసుస్టేషన్‌కు చేరిన యజమానులకు వాటిని అప్పగించే ప్రయత్నం చేయగా వాటి ఊసే లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రహస్య విచారణ
సుమారు రూ.80లక్షలకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసు ఉన్నతాధికారి రహస్య విచారణ చేయించినట్లు తెలిసింది. అప్పటి సీఐ పట్టుబడిన వెండి, నగదును పోలీసుస్టేషన్‌లోనే భద్రపరిచి మాయం చేసినట్లు దాదాపుగా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదిక త్వరలో ఎస్పీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో అదే పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పాత్ర కూడా ఈ ఘటనలో చర్చనీయాంశంగా మారింది.
సైకో హల్‌చల్
పత్తికొండ రూరల్: పట్టణంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పలు వాహనాల అద్దాలను పగలగొట్టడమే కాక ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హోసూరు గ్రామానికి చెందిన వన్నూర్‌వలికి మతిస్థిమితం సరిగా లేదు. గ్రామంలో పొలం పనులు చేసుకునే ఈయన వ్యక్తిగత పనిమీద బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పత్తికొండకు వచ్చాడు.ఉన్నట్టుండి పోలీసు స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిలో రోడ్డుకు అడ్డంగా వెళ్లి దారిలో వెళ్తున్న కారుని ఆపి పిడిగుద్దులతో అద్దాలు పగులగొట్టాడు. తర్వాత అక్కడే ఓ ఇనుప పైపును పెకిలించి దాంతో ఆర్టీసీ బస్సు, రెండు జీపుల అద్దాలను ధ్వంసం చేసి ఆర్టీసీ కండక్టర్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ రామాంజినేయులుపై దాడి చేశాడు. తర్వాత ఇనుప రాడ్డు తీసుకుని పోలీసు స్టేషన్‌లోకి వెళ్లి ఫర్నీచర్‌పై బాదుతూ హల్‌చల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు స్థానికుల సాయంతో చేతికి సంకేళ్లు వేసి స్టేషన్‌లో కూర్చొబెట్టారు. గతంలో కూడా ఇదే విధంగానే ఇతనిపై వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన కేసు ఉంది. వన్నూర్‌వలిపై కేసు నమోదు చేసి చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని మెంటల్ ఆసుపత్రికి తరలిస్తామని సీఐ మురళీమోహన్ తెలిపారు.
ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని సత ్కరిస్తున్న మంత్రి, జెడ్పీ చైర్మన్, తదితరులు
యజమానుల రాకతో వెలుగులోకి..
తనిఖీల్లో పట్టుబడిన వెండి, నగదుకు సంబంధించి యజమానులు ఈనెల 27న తగిన ఆధారాలతో పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పట్టుబడిన సమయం నుంచి ఇప్పటి వరకు ఆ పోలీసుస్టేషన్‌లో ముగ్గురు అధికారులు మారిపోయారు. ఇప్పుడున్న సీఐ జరిగిన విషయాన్ని తెలుసుకొని వెండి, నగదు అప్పగించే ప్రయత్నం చేయగా అసలు వాటి జాడనే లేదని తెలిసి అవాక్కయ్యారని తెలిసింది. గోప్యంగా ఉంచితే తన తలకు చుట్టుకుంటుందని భావించి విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరవేసినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా..
వాస్తవంగా ఎలాంటి బిల్లులు లేకుండా దొరికిన విలువైన వస్తువులు, నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వారి ఆధీనంలో ఉంచాలనేది నిబంధన. అయితే సదరు సీఐ ఈ నిబంధన తనకు వర్తించదు అనుకున్నారో, లేక అడిగేవారు ఎవరు అనుకున్నారో కానీ స్టేషన్‌లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కడే అంత మొత్తాన్ని అరిగించుకులేను అనుకున్నాడేమో.. ఓ రైటర్, మరో ఇద్దరు పోలీసులను ఈ వ్యవహారంలో కలుపుకున్నట్లు సమాచారం.


అలంకరణలో స్వామివారు

పత్తికొండ ప్రధానరోడ్డులో ఇనుప రాడ్డుతో వీరంగం సృష్టిస్తున్న సైకో

ఉసేన్‌బాషా (ఫైల్)