ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. జీతాలు రాక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు ప | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. జీతాలు రాక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు ప

May 16 2025 12:55 AM | Updated on May 16 2025 12:55 AM

ఉద్యో

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని

ఆళ్లగడ్డ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకంలో ఏపీఓ, ఈసీ టీఏ, ఎఫ్‌ఏ, కంప్యూటర్‌ ఆపరేటర్లు 677 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా సమన్వయంతో పనులు చేస్తున్నారు. దాదాపు 60 వేల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనులు గుర్తించడం, ప్రతి రోజు కూలీలతో చేయించడం, సకాలంలో వేతనాలు అందిస్తున్నారు. కాంపోటెంట్‌ పనులకు బిల్లులు చెల్లించడంలో వీరందరి పాత్ర కీలకం. అయితే వీరే సుమారు మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం!

ఉపాధి కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించే బాధ్యతలో అధికారులు, సిబ్బంది కీలక భాగస్వాములు. ఉపాధి పనుల్లో పండ్ల తోటల పెంపకం, సాగునీటి కాల్వలు, చెరువులు, నీటి కుంటలు, డంపింగ్‌ యార్డ్‌లు, గోకులాల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ ఉంటాయి. ‘ఉపాధి’ కూలీలకు వారవారం వేతనం బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా అధికారులు, సిబ్బంది చూడాలి. అయితే వీరికి సకాలంలో జీతాలు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే వేతనాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుర్తింపు ఏదీ?

ఉపాధి హామీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిని రెండు సంవత్సరాలు దాటితే ఫిక్స్‌ టెన్యూర్‌ ఎంప్లాయ్‌గా గుర్తించాలి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగానే చాలీచాలని వేతనాలు అందజేస్తున్నారని మండి పడుతున్నారు. లక్ష్యాలు విధిస్తూ పనిభారం పెంచుతున్న ప్రభుత్వం ఫిక్స్‌ టెన్యూర్‌ ఎంప్లాయ్‌గా గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

పెండింగ్‌ బిల్లులు రూ. 100 కోట్లు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో చేసిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు జిల్లాలో సుమారు రూ. 100 కోట్లకు చేరుకున్నాయి. సుమారు ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా మొదలు పెట్టిన పనులన్నీ సంపూర్తిగా నిలిచిపోయాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన పనులకే బిల్లుల రాని కారణంగా కొత్తవి చేపట్టెందుకు వెండర్లు ఎవరూ ముందుకు రావడంలేదు.

‘ఉపాధి’ సిబ్బందికి మూడు నెలలుగా

అందని జీతాలు

కుటుంబాల పోషణకు ఆపసోపాలు

రూ. 1.30 కోట్లకు పైగా

వేతన బకాయిలు

జీతాల కోసం 677 మంది ఉద్యోగుల

ఎదురు చూపు

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని 1
1/1

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement