రెండో విడతకు నోటిఫికేషన్
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మిర్యాలగూడ : రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 282 పంచాయతీల ఎన్నికలకు ఆదివారం ఉదయం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వెంటనే ఆయా మండలాల్లోని 282 సర్పంచ్, 2,418 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. సర్పంచ్ స్థానాలకు 163 మంది, వార్డులకు 156 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 2వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంది. నామినేషన్ల క్లస్టర్ కేంద్రాలను జిల్లా అధికారులు పరిశీలించారు. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.
నిడమనూరు మండలంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు
ఫ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
ఫ తొలిరోజు తక్కువ సంఖ్యలో
దాఖలైన నామినేషన్లు
రెండో విడతకు నోటిఫికేషన్


