తిప్పర్తి : కేంద్రం ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 జాతీయ విద్యావిధానం ద్వారా విద్యా రంగానికి తీవ్రనష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మతపరమైన మాలలు వేసి పంపండం సరైనది కాదన్నారు. అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను ఉచితంగా అందించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. విద్యకు బడ్జెట్‌లో నిధులు పెంచితేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా రూ.700 కోట్లు కేటాయిస్తామని చెప్పి రెండు నెలలు మాత్రమే ఇచ్చిందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ అభ్యుదయ భావజాలంతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యకు 60శాతం గ్రాంటు కేంద్రమే ఇవ్వాలన్నారు. పాతికేళ్ల సర్వీస్ పూర్తయిన ఉపాధ్యాయులకు టెట్ అవసరమని చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, నాయకులు చిలుక రాజు, ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, పెరుమాళ్ల వెంకటేశం, నర్రా శేఖర్‌రెడ్డి, పిన్నం వీరాచారి, నలపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించాలి
నిడమనూరు : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా కృషిచేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేత సూచించారు. ఆదివారం నిడమనూరు మండంలోని కోటమైసమ్మ ఆలయాన్ని ఆయన దర్శించారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు ఎడవెల్లి వల్లభరెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా కై లాస్‌నేత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాలు, సీనియర్ మాజీ మంత్రి జానారెడ్డి సూచనలతో గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా మొదటిసారిగా వచ్చిన కై లాస్‌నేతను స్థానిక నాయకులు, కోటమైసమ్మ ఆలయ ఫౌండర్ చైర్మన్ సీహెచ్ ఆంజనేయులు సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎడవెల్లి విక్రమ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అంకతి సత్యం తదితరులు ఉన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేయాలి
రామగిరి(నల్లగొండ) : రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్ కోరారు. ఆదివారం నల్లగొండలో జరిగిన బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో బ్రా హ్మణుల ప్రాధాన్యం తగ్గుతుందని.. బ్రాహ్మణులంతా ఐక్యమై హక్కులను కాపాడుకోవా లని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో బ్రా హ్మణ భవన్ నిర్మించారని, ధూప దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిందని, అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్ నీరజ నేవర్స్, మంత్రవాది శ్రవణ్‌కుమార్, రామారావు, దండెంపల్లి నరసింహారావు, వేణుగోపాలరావు, అభిలాష్, వాసుదేవశర్మ, యమునా పాఠక్, నీరజ, సుధాకర్‌రావు, ఆదిత్యశర్మ, వెంకటరమణరావు, సంధ్యారాణి పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి


