పాఠశాలలే.. కొనుగోలు కేంద్రాలు
నిడమనూరు : పాఠశాల మైదానాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారుతున్నాయి. తరగతి గదులు స్టోర్ రూమ్‌లుగా దర్శనమిస్తున్నాయి. నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం, నారమ్మగూడెం పాఠశాలల మైదానంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఆవరణ అంతా ధాన్యం రాశులతో నిండిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
విద్యాభ్యాసానికి ఆటంకం
రాజన్నగూడెం ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. నారమ్మగూడెం పాఠశాలల్లో 60 మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు ఈ పాఠశాలల ఆవరణలో ధాన్యం పోశారు. తరగతి గదుల్లో తూకం యంత్రాలు, బస్తాలు వేశారు. ధాన్యం కొనుగోళ్లు నెల రోజులపాటు సాగుతాయి. వానాకాలం సీజన్‌లో డిసెంబర్, యాసంగి సీజన్‌లో పరీక్షల సమయంలో మార్చి మూడో వారంలో ధాన్యం కొనుగోళ్లు ఆయా పాఠశాల మైదానాల్లో ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఆవరణ అంతా ధాన్యం నిండిపోతోంది. ప్రభుత్వ పాఠశాలలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారడంతో విద్యార్థులు క్రీడలకు, విద్యాభాసానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచైనా పాఠశాల మైదానం కాకుండా ప్రత్యామ్నాయ స్థలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నారమ్మగూడెం పాఠశాల ఆవరణలో ధాన్యం ఆరబోత
రాజన్నగూడెం పాఠశాల ఆవరణలో గోనెసంచులు, ప్యాడీ క్లీనర్, ఎలక్ట్రానిక్ కాంటాలు
ఫ రాజన్నగూడెం, నారమ్మగూడెంలో పాఠశాల ఆవరణలో నిర్వహణ
ఫ ఏటా రెండు సీజన్లలో నెలరోజులకు పైగా ధాన్యం కొనుగోళ్లు
ఫ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
పాఠశాలలే.. కొనుగోలు కేంద్రాలు


