ఆపరేషన్ కగార్ రాజ్యాంగ విరుద్ధం
నల్లగొండ టౌన్ : ఆపరేషన్ కగార్ రాజ్యాంగ విరుద్దమని ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని లయన్స్ క్లబ్ భవన్‌లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రింకోర్టు జడ్జిచేత విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్‌ను విరమించాలని నిరసన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతోఅధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టి ఆదివాసీలను, మావోయిస్టులను చంపడం కోర్టు దిక్కారమే అన్నారు. దేశంలో జరిగిన ఎన్‌కౌంటర్లన్నీ రాజ్యాంగ విరుద్దంగా జరుగుతున్నాయని హిడ్మా 20 కోట్ల మంది ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్నాడన్నారు. మారేడుపల్లి ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్సనం నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఆయా సంఘాల నాయకులు ఆర్.జనార్దన్, కె.పర్వతాలు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అనంతరెడ్డి, సీహెచ్.సుధాకర్‌రెడ్డి, పాలడుగు నాగార్జున, కె.నాగేశ్వర్‌రావు, సతయ్య, గురూజి, రాములు, సాగర్, కొమరయ్య, పాండు రంగారావు, చిరంజీవి, విజయ్‌కుమార్, రామచంద్రయ్య, లెనిన్, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.


