
కొనసాగిన కేంద్ర బృందం పర్యటన
వనపర్తి రూరల్: పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో ఆదివారం కేంద్ర బృందం 28వ కమిటీ నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి అర్వింద్‌కుమార్, సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త యాదయ్య పర్యటించారు. కంచిరావుపల్లి, తాటిపాముల, కంభాళాపురం శివారులోని భీమా 15వ ప్యాకేజీలోని ప్రధాన, మైనర్ కాల్వలు, కంభాళాపురం తండా 27 ప్యాకేజీలోని 18/19 కాల్వ 7ఆర్ మైనర్ కాల్వను, శ్రీరంగాపురం రంగసముద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సాగునీటి సరఫరా ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కాల్వల్లో జమ్ము, పూడిక పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వివరించారు. ఫీడర్ ఛానల్, డిస్ట్రిబూష్యన్ షట్టర్లు, కాల్వల వెడల్పు పెంచడం, లైనింగ్ సరిగా లేదని జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, వెంకట్రామారెడ్డి రైతులతో కలిసి కేంద్ర బృందానికి సమస్యల వినతిపత్రం అందజేశారు. వారి వెంట ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ కేశవరావు, డీఈ కిరణ్‌కుమార్, డీసీసీ అఽధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, ఏఈలు, ఇతర అధికారులు ఉన్నారు.