
ప్రతిపాదనలు పంపాం
జనరల్ ఆస్పత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరో 300 పడకల ఆస్పత్రిని త్వరలోనే ఏర్పాటు చేసి వైద్య విద్యార్థులకు ప్రాక్రీస్‌తో పాటు రోగులకు అన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.
– డా.రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
అనుమతులు మంజూరయ్యాయి
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతులను బోధించేందుకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
– డా.రమాదేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
●

ప్రతిపాదనలు పంపాం