
‘బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం’
నాగర్‌కర్నూల్: బాలల హక్కుల పరిరక్షణ, పిల్లలందరికీ సమాన అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు విద్య, వైద్య, పోలీస్, సీ్త్ర శిశు సంక్షేమ, కార్మిక శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి సూచించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా బిజినేపల్లి, తాడూరు మండలాల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, అనాథ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, అందుతున్న భోజనం, విద్యా తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలనతో చేసి సమీక్ష నిర్వహించారు. మిషన్ వాత్సల్య జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరు గురించి చర్చించా రు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచనకుమార్, సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అదనపు ఎస్పీ రామేశ్వర్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, జిల్లా బాలల సంరక్షణ చైర్మన్ లక్ష్మణరావు, డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలంగౌడ్, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.